తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన శామ్​సంగ్​ ఆదాయం - supply

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ​ శామ్​సంగ్​కు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య లాభాలు భారీగా తగ్గాయి.

శామ్​సంగ్​

By

Published : Apr 30, 2019, 7:59 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్​ఫోన్, మొమరీ చిప్​​ తయారీదారైన దిగ్గజ సంస్థ శామ్​సంగ్ ఎలక్ట్రానిక్స్​కు ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆదాయం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభాలు 56.9 శాతం పడిపోయి 4.3 బిలియన్​ డాలర్ల(దాదాపు రూ.30వేల కోట్ల)కు చేరాయి. 2016 మూడో త్రైమాసికం అనంతరం ఈ లాభాలే అత్యల్పం.

నిర్వహణ లాభాలు సైతం 60.2 శాతం తగ్గి 6.2 ట్రిలియన్లకు చేరాయి. అదే సమయంలో విక్రయాలు 13.5శాతం తగ్గి 52.4 ట్రిలియన్లకు చేరాయి.

దెబ్బ మీద దెబ్బ....

డిస్​ప్లే​​ సమస్యల కారణంగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మడిచే(ఫోల్డబుల్​) స్మార్ట్​ఫోన్​ విడుదలను గత వారం వాయిదా వేసింది శామ్​సంగ్​. ఇప్పుడు ఈ ఫలితాలు సంస్థకు మరో చేదు వార్తగా ఉంది.

శామ్​సంగ్​కు గడ్డు పరిస్థితులు

11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియాకు శామ్​సంగ్​ సంస్థ చాలా ముఖ్యం. ఆ దేశంలో ఒకే కుటుంబం చేతుల్లో ఉన్న సంస్థల్లో ఇదే అతిపెద్దది.

ఉత్పత్తులను వెనక్కి పిలిపించటం సహా సంస్థ సారథి అరెస్టు లాంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాల్లో మంచి లాభాలను గడించింది శామ్​సంగ్​. ఈ పరిస్థితి ప్రస్తుతం మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా, పోటీ పెరిగిపోవటం... చిప్​ల ధరలు తగ్గిపోతుండటమే దీనికి కారణంగా కనబడుతోంది.

2017 స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో యాపిల్​ను వెనక్కినెట్టిన హువావే రెండో స్థానాన్ని ఆక్రమించింది. తక్కువ ధరల్లో మంచి ఫోన్లను విడుదల చేస్తున్న ఈ సంస్థ నుంచి శామ్​సంగ్​ తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోంది.

డిమాండ్​ తగ్గుదల

డిస్​ప్లే, చిప్​ విక్రయాల తగ్గుదల వల్ల నిర్వహణ లాభాలు మొదటి త్రైమాసికంలో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పెట్టుబడిదారులకు తెలిపింది శామ్​సంగ్​.

ప్రపంచంలోనే మొదటి సారిగా దేశవ్యాప్త 5జీ నెట్​వర్క్​ను ఆవిష్కరించటానికి దక్షిణ కొరియాకు అనుమతి లభించింది. దీనితో 5జీ సామర్థ్యమున్న ఎస్​10 స్మార్ట్​ఫోన్​ మోడల్​​ను విడుదల చేసింది శామ్​సంగ్​.

మడిచే ఫోన్​

మడిచే సౌలభ్యం ఉన్న ఫోన్​ శామ్​సంగ్​దే మొదటిది కాకపోయినప్పటికీ... ఆ విభాగంలో మార్కెట్​ వాటాను ఆ సంస్థ కైవసం చేసుకొని ఆవిష్కరణలకు ఊతమిస్తుందనే అంచనాలున్నాయి. గెలాక్సీ ఫోల్డబుల్​​ ఫోన్​ను ఎనిమిది సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తోంది శామ్​సంగ్​.

ABOUT THE AUTHOR

...view details