చైనాకు చెందిన స్టార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి షాకిచ్చింది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. భారత మొబైల్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో రారాజుగా వెలుగొందుతున్న షియోమీని.. శాంసంగ్ వెనక్కి నెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య మొబైల్ ఫోన్ల విక్రయాలకు సంబంధించి ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
షియోమీకి షాక్- అగ్రస్థానానికి శాంసంగ్ - ఆఫ్‌లైన్ మార్కెట్లో శాంసంగ్ కింగ్
మొబైల్ ఫోన్ల మార్కెట్లో షియోమీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది శాంసంగ్. బాయ్‌కాట్ చైనా వంటి సెంటిమెంట్ల ప్రభావం షియోమీ విక్రయాలపై భారీగా పడటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
షియోమీకి శాంసంగ్ షాక్
ఈ నివేదిక ముఖ్యాశాలు..
- జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొబైల్ ఫోన్ మార్కెట్లో 24 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని అగ్రస్థానానికి చేరింది శాంసంగ్. షియోమీ, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- స్మార్ట్ఫోన్ల ఆఫ్‌లైన్ విక్రయాల్లో 29.1 శాతం మార్కెట్ వాటాతో 2020 రెండో త్రైమాసికంలో అగ్రస్థానంలో నిలిచింది శాంసంగ్. ఆన్లైన్ విక్రయాల పంరంగా మాత్రం 22.8 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
- కేవలం స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లోనూ వివోను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరగలిగింది శాంసంగ్.
- దేశవ్యాప్తంగా అత్యధిగంగా అమ్ముడైన టాప్ 5 మోడళ్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం21 కూడా ఒకటి.
- టాప్ 5 మోడళ్లలో నాలుగు షిమీమోకి చెందినవే. అందులో రెడ్మీ నోట్ 8ఏ డ్యుయల్, నోట్ 9 ప్రో, రెడ్మీ 8 ఉన్నాయి.