తెలంగాణ

telangana

ETV Bharat / business

శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీకున్‌ హీ కన్నుమూత - lee-kun-hee passed away

శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీ కున్‌-హీ ఆదివారం కన్నుమూశారు. 2014 నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన గుండె శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు.

Samsung-chairman-Lee-Kun-hee-passes-away
శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీకున్‌ హీ కన్నుమూత

By

Published : Oct 25, 2020, 8:55 AM IST

Updated : Oct 25, 2020, 11:49 AM IST

తన తండ్రి లీ బైంగ్​ -చుల్ స్థాపించిన శామ్​సంగ్ సంస్థను ప్రపంచ దిగ్గజంగా మార్చిన లీ కున్ -హీ ఇక లేరు. 2014 నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన గుండె శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఆరోగ్యం క్షీణించినందువల్ల ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

కొరియాలోని డేగులో 1942 జనవరి 9న లీ కున్​-హీ జన్మించారు. తన తండ్రి మరణం తర్వాత 1987లో లీ కున్‌ శామ్‌సంగ్‌ బాధ్యతలు చేపట్టారు. స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్‌ చిప్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేసే అగ్రగామి సంస్థగా అభివృద్ధి చేశారు.

Last Updated : Oct 25, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details