ఒక్క డోసులో ఇచ్చే రష్యన్ టీకా 'స్పుత్నిక్ లైట్'ను వీలైనంత త్వరగా భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత ఔషధ సంస్థ డాక్టర్. రెడ్డీస్ ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం.
స్పుత్నిక్ లైట్ అందుబాటులోకి వస్తే దేశంలో ఇచ్చే తొలి 'సింగిల్ డోస్ టీకా' ఇదే అవుతుంది. దీంతో భారత్లో టీకా పంపిణీ కార్యక్రమం ఊపందుకోనుంది. ఈ టీకా సామర్థ్యం 79.4 శాతం.