భారత్లో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), పనాసియా బయోటెక్ సంస్థలు సోమవారం సంయుక్త ప్రకటన చేశాయి. త్వరలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని పనాసియా బయెటెక్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే మొదటి విడత టీకాలను నాణ్యతా ప్రమాణాల పరీక్షల నిమిత్తం రష్యాలోని గమలేయా సెంటర్కు తరలించనున్నారు.
భారత్లో స్పుత్నిక్ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం - భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
భారత్లో స్పుత్నిక్ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభించినట్లు ఆర్డీఐఎఫ్, పనాసియా బయోటెక్ సంస్థలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో చేపట్టి.. ఏడాదికి 10 కోట్ల చొప్పున డోసులను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశాయి.
స్పుత్నిక్ వీ టీకా
గత నెలలో ప్రకటించిన విధంగానే స్పుత్నిక్ డోసులు ఏడాదికి 10 కోట్ల చొప్పున ఉత్పత్తి చేస్తామని సంస్థలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ను ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తామని ఆ తర్వాత విదేశాలకు కూడా సరఫరా చేస్తామని పనాసియా బయెటెక్ ఎండీ రాజేశ్ జైన్ వెల్లడించారు.
ఇదీ చదవండి :ఈ కంపెనీల నిమిషం సంపాదన ఎంతో తెలుసా?
Last Updated : May 24, 2021, 4:20 PM IST