తెలంగాణ

telangana

ETV Bharat / business

రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో ఇవి ప్రియం!

Russia Ukraine Crisis News: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉపశమించకపోతే, భారత్‌కు ఆ సెగ తగిలేలా ఉంది. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో ఇవి ప్రియం
Russia Ukraine Crisis News

By

Published : Feb 25, 2022, 5:46 AM IST

Russia Ukraine Crisis News: ఉక్రెయిన్​- రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే.. భారత్​పై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

పొద్దుతిరుగుడు పువ్వు నూనె:గతేడాది మనదేశం 1.89 మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచే వచ్చింది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. మొత్తంమీద నెలకు 2-3 లక్షల టన్నుల ఈ నూనె దేశంలోకి దిగుమతి అవుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. ఉద్రిక్తత మరో 2-3 వారాలు కొనసాగితే మనకు ఇబ్బందే.

గోధుమలు: గోధుమలు ఎక్కువగా వినియోగించే దేశాల్లో మనదేశం ఒకటి కాగా.. ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్రగామి. గోధుమల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉక్రెయిన్‌ నిలిచింది. నల్ల సముద్రం ప్రాంతం నుంచి ఎక్కువగా గోధుమల సరఫరా జరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు పైకి చేరొచ్చు. ప్రస్తుతం భారత్‌ వద్ద 24.2 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉండటంతో దేశీయ ఎగుమతిదార్లు దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

సెల్‌ఫోన్లపైనా:మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే లోహం- పల్లాడియం అతిపెద్ద ఎగుమతిదారుగా రష్యా ఉంది. రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పల్లాడియం ధరలు ప్రియం కానున్నాయి.

టీ:భారత్‌ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లు కలవరపడుతున్నారు. రష్యాపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 2700 పాయింట్లు డౌన్​

ABOUT THE AUTHOR

...view details