తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణభారం నుంచి కాస్త ఉపశమనం - Reporate

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును తగ్గిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రెపోరేటు

By

Published : Feb 7, 2019, 3:01 PM IST

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే లక్ష్యంగా రెపోరేటు, రివర్స్​ రెపోరేట్లపై రిజర్వు బ్యాంక్​ 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల గృహాలు ఇతర రుణాలపై ఈఎమ్​ఐ భారం తగ్గనుంది. నూతన గవర్నర్​ శక్తికాంతదాస్​ నేతృత్వంలో తొలిసారి భేటీ అయిన ద్రవ్య పరపతి విధాన సభ్యుల కమిటీ 'వడ్డీ రేట్లలో మార్పు లేదని' స్పష్టం చేసింది.

సమీక్షలో కీలక నిర్ణయాలు

⦁ రెపోరేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గింపు
⦁ రివర్స్​ రెపోరేటు 6.25 నుంచి 6 శాతానికి పరిమితం
⦁ బ్యాంక్​ రేటు 6.5 శాతం
⦁ యథాతథంగా సీఆర్​ఆర్(క్యాష్​ రిజర్వు రేషియో)​ (4 శాతం)
⦁ వడ్డీరేట్లు యథాతథం
⦁ రైతులకు వడ్డీలేని వ్యవసాయ రుణాల పరిమితి లక్ష రూపాయల నుంచి రూ. 1.6 లక్షలకు పెంపు
⦁ రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు 'ఆఫ్​షోర్​ రూపాయి మార్కెట్​'కు టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు
⦁ కార్పొరేట్​ రుణ మార్కెట్ల పెట్టుబడిదారులకు విదేశీ పోర్ట్​ఫోలియోపై పరిమితుల తొలగింపు
⦁ 'వ్యవసాయ జమ(క్రెడిట్​) సమీక్ష'కు ఇంటర్నల్​ వర్కింగ్​ గ్రూప్​ ఏర్పాటు
⦁ 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా.
⦁ తదుపరి బోర్డు సమావేశం ఏప్రిల్​ 2-4

డిప్యూటీ గవర్నర్​ రెపోరేటు, రివర్స్ రెపోరేటు తగ్గింపునకు విముఖత వ్యక్తం చేసినా 4:2 నిష్పత్తిలో సభ్యులు ఆమోదం తెలిపారు. కీలక వడ్డీ రేట్లను మాత్రం యథాతథంగా ఉంచేందుకే సభ్యలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.

" గతేడాది డిసెంబర్​లో ద్రవ్యోల్బణాన్ని(2.2 శాతం)18 నెలల కనిష్ఠానికి తగ్గించాం. 2019 మార్చి త్రైమాసికానికి 2.8, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 3.2-3.4 శాతం, 2020 ఆర్థిక సంవత్సరం త్రైమాసికానికి 3.9 శాతంగా ద్రవ్యోల్బణం ఉంటుంది. కూరగాయల ధరలు, నూనెలు, విద్య, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం."
-రిజర్వు బ్యాంక్​

ABOUT THE AUTHOR

...view details