తెలంగాణ

telangana

ETV Bharat / business

రాయల్​ ఎన్​ఫీల్డ్ బైక్​ కొనాలనుకునే వారికి షాక్! - రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధర

దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా వంటి కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచగా.. ఈ జాబితాలో ఇప్పుడు రాయల్ ఎన్​ఫీల్డ్ చేరింది. మోడళ్ల వారీగా రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ల ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి.

Royal Enfield bike get Huge price hike
భారీగా పెరిగిన రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ల ధరలు

By

Published : Jul 13, 2021, 1:23 PM IST

రాయల్​ ఎన్​ఫీల్డ్ బైక్​ కొనాలనుకునే వారికి షాక్ ఇస్తూ తమ బైక్​ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ​. మోడళ్ల వారీగా రూ.4,500 నుంచి రూ.8,000 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ల ధరలు పెరగటం ఈ ఏడాది ఇది మూడో సారి. చివరి సారిగా ఏప్రిల్​లో.. రూ.10,000 వరకు ధరలు పెంచింది కంపెనీ.

ముడి సరకు వ్యయాల పెంపు వంటి కారణాలతో బైక్​ల ధరల పెంపునకు రాయల్​ ఎన్​ఫీల్డ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి.

మోడళ్ల వారీగా పెరిగిన ధరలు ఇలా..

బుల్లెట్ 350 బైక్​ ధర ఇంతకు ముందు రూ.1.34 లక్షల నుంచి రూ.1.55 లక్షల మధ్య ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.1.39-1.60 లక్షలకు చేరింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్-బుల్లెట్​

మీటియర్​ 350 బైక్​ ఇకపై రూ.1.92-2.08 లక్షలుగా ఉండనుంది. ఇంతకు ముందు ఈ బైక్ ధర రూ.1.84-2 లక్షలుగా ఉండేది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌- మీటియర్

హిమాలయన్​ బైక్​ ధర రూ.2.01-2.09 లక్షల నుంచి రూ.2.06-2.13 లక్షలకు పెరిగింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌- హిమాలయన్‌

ఇంటర్​సెప్టర్​ 650 బైక్ ధర రూ.2.75-2.97 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.2.81-3.04 లక్షలకు చేరింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌- ఇంటర్​సెప్టర్​

కాంటినెంటర్ జీటీ 650 బైక్​ ధరను రూ.2.98-3.20 లక్షలకు పెంచింది రాయల్​ ఎన్​ఫీల్డ్. ఇంతకు ముందు ఈ ధర రూ.2.92-3.13 లక్షల మధ్య ఉండేది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ - కాంటినెంటల్ జీటీ

ఇదీ చదవండి:Apple Days Sale: తక్కువ ధరకే ఐఫోన్లు- లిమిటెడ్​ ఆఫర్​!

ABOUT THE AUTHOR

...view details