ఏప్రిల్ 1 నుంచి సరళీకృత నెలవారీ 'వస్తు, సేవల పన్ను' (జీఎస్టీ) రిటర్న్ఫారాల విడుదలకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సాఫ్ట్వేర్ సిద్ధమయ్యాక దీన్ని తీసుకురానున్నారు. జీఎస్టీ మండలి నోటిఫై చేసిన అనంతరం నూతన సరళీకృత జీఎస్టీ ఫారాలు అందుబాటులోకి రానున్నాయి.
పన్ను చెల్లింపుదారులు సులభంగా జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయడానికి సరికొత్త విధానం తీసుకురావాలని గతేడాది జూలైలో జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఈ ఏప్రిల్ 1 నుంచి 'సహజ్, సుగమ్' ఫారాలతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని తీర్మానించింది.