తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్​కు అధిక వృద్ధి రేటు సాధించే సత్తా ఉంది.. కానీ' - భారత వృద్ధిపై రేటింగ్ ఏజెన్సీల నివేదికలు

భారత ఆర్థిక వ్యవస్థకు అధిక వృద్ధి రేటు సాధించే సత్తా ఉందని.. అయితే ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించాలంటే సంస్కరణలు ఎంతో అవసరమని ఎస్​&పీ రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి డీలా పడ్డా వచ్చే ఏడాది భారత్​కు ఆశాజనకంగానే ఉన్నట్లు అంచనా వేసింది.

s&p on India growth
భారత వృద్ధిపై ఎస్​&పీ అంచనాలు

By

Published : Jun 13, 2020, 11:30 AM IST

ఈ ఏడాది నెలకొన్న సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టెక్కాలంటే సంస్కరణలు ఎంతో కీలకమని రేటింగ్ ఏజెన్సీ ఎస్​&పీ గ్లోబర్​ అభిప్రాయపడింది. మధ్య నుంచి దీర్ఘకాలంలో భారత్​ 6.5-7 శాతం వరకు వృద్ధిని సాధించే సత్తా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

వర్ధమాన దేశాల్లో మైరుగైన పనితీరు...

వరుసగా 13వ ఏడాదీ భారత్‌కు తక్కువ పెట్టుబడి గ్రేడ్‌ రేటింగ్‌నే కొనసాగించిన ఎస్‌&పీ ఒక వెబినార్​లో ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది వృద్ధి డీలా పడ్డా.. వర్ధమాన దేశాల్లో మెరుగైన పనితీరును కనబరచడానికి భారత్‌కు అవకాశాలున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5% క్షీణతను నమోదు చేయవచ్చని; వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 8.5% వృద్ధిని సాధించవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ అంచనా కట్టింది.

కరోనా విధ్వంసం సృష్టిస్తే..

ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి మరింత విధ్వంసానికి ఒడిగడితే మాత్రం భారత రేటింగ్‌ను తగ్గించకుండా ఉండలేమని.. అందుకు ఈ గణాంకాలు అడ్డురాబోవని స్పష్టం చేసింది ఎస్​&పీ.

ఇదీ చూడండి:యాపిల్​ వాచ్​ల్లోనూ వొడాఫోన్​ సెల్యూలర్ సేవలు

ABOUT THE AUTHOR

...view details