తెలంగాణ

telangana

ETV Bharat / business

యువతలో సొంతింటికి పెరిగిన డిమాండ్​! - సొంతిటి విషయంలో యువతరం కొత్త పంతా

మిలీనియల్స్ అంటే ఆన్ డిమాండ్ సేవలకే మొగ్గు చూపుతారు. అద్దె జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది కొవిడ్​ ముందు వరకు. ఇప్పుడు లెక్క మారింది. ఇటీవలి కాలంలో మిలీనియల్స్ సొంతింటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆ సర్వే వెల్లడించిన మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

Younger Generation change on Own House
సొంతింటి విషయంలో యువతలో మార్పు

By

Published : Apr 23, 2021, 8:15 PM IST

సొంతిళ్లు ప్రతి ఒక్కరి కల. అయితే మిలీనియల్స్​ (1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు) ఈ విషయంలో కాస్త డిఫరెంట్​. సొంతింటకంటే.. అద్దె ఇంటికే అధిక ప్రాధాన్యతనిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కరోనా తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మిలీనియల్స్ ఇప్పుడు ఎక్కువగా సొంతింటిని కొనుగోలు చేస్తున్నారు. నో బ్రోకర్​ అనే స్థిరాస్తి సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది.

సర్వేలోని మరిన్ని విషయాలు..

  • కరోనా చాలా విషయాల్లో మార్పును తీసుకొచ్చింది. మిలీనియల్స్ ఇళ్ల విషయంలో ఆలోచించే తీరును కూడా మార్చేసింది. కొత్తగా ఇళ్లు కొనే వారిలో మిలీనియల్స్ ఎక్కవగా ఉంటున్నారు.
  • 2020లో సొంతిళ్లు కొనుగోలు చేసిన వారిలో మిలీనియల్స్​ ఎక్కువగా ఉన్నారని సర్వేలో పాల్గొన్న 85 శాతం గృహ నిర్మాణ సంస్థలు తెలిపాయి.
  • విశాలమైన ఇంటికే మిలీనియల్స్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకు ఎక్కువ బడ్జెట్ కేటాయించేందుకు వెనకాడటం లేదు.
  • కొత్త గృహ వినియోగదారుల్లో 24.1 శాతం మంది రూ.60 నుంచి రూ.80 లక్షల మధ్య బడ్జెట్​కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • రూ.కోటి, అంతకంటే ఎక్కువ బడ్జెట్​కు ప్రాధాన్యం ఇస్తున్న వారు 20.4 శాతం మంది.
  • 2020లో డిమాండ్ పెరుగుదలలో రెండు పడక గదులు ఇళ్లు మొదటి స్థానంలో ఉన్నాయి.
  • 2019తో పోలిస్తే డబుల్ బెడ్ రూం ఇళ్లకు 59 శాతం డిమాండ్ పెరిగింది. 1 బీహెచ్​కే ఇళ్లకు 22 శాతం మాత్రమే డిమాండ్ పుంజుకుంది.
  • వర్క్ ఫ్రం హోం వల్ల దేశవ్యాప్తంగా నగరంలోని ఇళ్ల కంటే పట్టణ శివారు ఇళ్లకు డిమాండ్ పెరిగింది.

ఇదీ చదవండి:ఎంఐ నుంచి ఒకేసారి మూడు ఫోన్లు, ఓ టీవీ

ABOUT THE AUTHOR

...view details