తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంటి రుణం ఈఎంఐ భారం నుంచి కాస్త ఊరట

రిజర్వు బ్యాంకు వడ్డీ రేటును 0.25శాతం తగ్గించింది. ఆ తగ్గింపు ప్రయోజనాన్ని ఖాతాదారులకు పూర్తిస్థాయిలో బదిలీ చేయలేదు భారతీయ స్టేట్​ బ్యాంక్.

By

Published : Feb 9, 2019, 6:24 AM IST

భారతీయ స్టేట్​ బ్యాంకు

గృహ రుణంపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్​బీఐ
రిజర్వు బ్యాంకు రెపో రేటు తగ్గింపుతో కలిగిన లబ్ధిని రుణగ్రహీతలకు బదిలీ చేస్తున్నాయి వివిధ బ్యాంకులు. భారతీయ స్టేట్​ బ్యాంకు 30 లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీరేటును 5 బేసిస్​ పాయింట్లు తగ్గించింది.

కొత్త రేట్లు శుక్రవారమే అమల్లోకి వచ్చాయి. గృహ రుణాల్లో అత్యధిక వాటా ఎస్​బీఐదేనని, వడ్డీరేటులో కోతతో పేద, మధ్యతరగతి వర్గాలు లాభపడతాయని చెప్పారు ఛైర్మన్​ రజనిష్​ కుమార్.

ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం వెలువరించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకైన 'బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర' వడ్డీరేట్లను 0.05 శాతం తగ్గించింది.

ABOUT THE AUTHOR

...view details