ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎంతో లాభదాయకత ఉన్న ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పాత తరం శైలి(రెట్రో స్టైలింగ్)తో హార్లే డేవిడ్‌సన్ మోడల్‌ను త్వరలోనే విపణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
భారత్‌కు రెట్రో-స్టైల్డ్ హార్లే డేవిడ్‌సన్.. ఎప్పుడంటే?
త్వరలోనే ప్రీమియం మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టనుంది దిగ్గజ వాహన తయారీ సంస్థ హీటో మోటోకార్ప్. రెట్రో-స్టైల్డ్ హార్లే డేవిడ్సన్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
హార్లీ డేవిడ్‌సన్
భారత్‌లో సుమారు దశాబ్ద కాలం పాటు ప్రీమియం బైక్‌లను విక్రయించిన అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్, గత ఏడాది నుంచి దేశీయంగా తయారీ కార్యకలాపాలు, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలోనే (2020 అక్టోబరు) హీరో-హార్లే డేవిడ్‌సన్ మధ్య ఒప్పందం కుదిరింది. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.
ఇదీ చూడండి:'ఓలా ఎలక్ట్రిక్' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు
Last Updated : Sep 20, 2021, 6:21 AM IST