అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) స్వల్పంగా పెరిగింది. గత నెలలో సీపీఐ 4.48 శాతంగా (Inflation Rate In India) నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలిపింది.
అంతకు ముందు నెల (సెప్టెంబర్లో) రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా ఉండగా.. గత ఏడాది అక్టోబర్లో ఏకంగా 7.61 శాతంగా నమోదైనట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్లో 0.85 శాతానికి పెరిగింది. సెప్టెంబర్లో ఇది 0.68 శాతంగా ఉంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 4.5, నాలుగో త్రైమాసికంలో 5.8గా ఉండోచ్చని అంచనా వేసింది.
పెరిగిన పారిశ్రామికోత్పత్తి..
ఈ ఏడాది సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం పెరిగినట్లు కేంద్ర జాతీయ గణాకాల సంస్థ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్లో కంటే ఇది ఒక శాతం ఎక్కువని పేర్కొంది.
ఇదీ చూడండి:ఆ రోజే స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్స్ లిస్టింగ్.. ఆరంభ ధర ఎంతంటే?