తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​లో తగ్గిన రిటైల్​ ద్రవ్యోల్బణం - పారిశ్రామిక ఉత్పత్తి

ఏప్రిల్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతానికి తగ్గింది. ఆహార ధరలు తగ్గడమే రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Retail inflation
రిటైల్​ ద్రవ్యోల్బణం

By

Published : May 12, 2021, 6:36 PM IST

ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. ఆహార ధరలు తగ్గడం వల్ల 4.29 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ మంత్రిత్వ నివేదిక స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 2.02 శాతంగా నమోదైంది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆంక్షల వల్ల ఏప్రిల్​ నెల ధరలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి..

మార్చి నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 22.4 శాతం పెరిగింది. ఇది మార్చి 2020లో 18.7 శాతంగా నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)ని విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం..

  • 2021 మార్చిలో తయారీ రంగ ఉత్పత్తి 25.8 శాతం పెరిగింది.
  • మైనింగ్ ఉత్పత్తి 6.1 శాతం, విద్యుత్ ఉత్పత్తి 22.5 శాతం పెరిగాయి.

ఇవీ చదవండి:మరింత పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details