తెలంగాణ

telangana

ETV Bharat / business

వార్తల కోసం కోట్ల​ డాలర్లు ఇస్తామంటున్న ఫేస్​బుక్​! - మిలియన్ల డాలర్లు

వార్తల ప్రచురణ హక్కుల కోసం ఫేస్​బుక్​ వార్తా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త హక్కుల కోసం మిలియన్ల డాలర్లను వెచ్చించడానికి ఫేస్​బుక్​ సిద్ధపడుతున్నట్లు తెలిపింది.

వార్తల కోసం కోట్ల​ డాలర్లు ఇస్తామంటున్న ఫేస్​బుక్​!

By

Published : Aug 9, 2019, 11:06 AM IST

ఫేస్​బుక్​ తన వెబ్​సైట్​లో వార్తలు అందించాలని కోరుతూ ప్రచురణకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వార్తల ప్రచురణ హక్కుల కోసం మిలియన్ల డాలర్లు చెల్లించడానికీ ఫేస్​బుక్​ సిద్ధమైనట్లు వినికిడి.

వార్తా పరిశ్రమకు హాని కలిగించేలా ఇన్నాళ్లూ ఫేస్​బుక్​ ఆన్​లైన్​ ప్రకటనలపై గుత్తాధిపత్యం వహించింది. దీనిపై ఏళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

వార్తా కథనాలు, ముఖ్యాంశాలు, ఇతర విషయాలపై లైసెన్స్​ పొందడానికి ఏడాదికి 3 మిలియన్​ డాలర్లు అందిస్తామని ఫేస్​బుక్​ ప్రతినిధిలు... న్యూస్​కార్ప్​ సంస్థకు ప్రతిపాదించినట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్ తెలిపింది. అయితే ఈ వార్తపై స్పందించడానికి ఫేస్​బుక్​ నిరాకరించింది.

అవును.... సంప్రదించారు

వాల్​స్ట్రీట్​ జర్నల్​ కథనాలకు లైసెన్స్ చెల్లించడం గురించి న్యూస్​ కార్ప్​ను ఫేస్​బుక్ సంప్రదించినట్లు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి ధ్రువీకరించారు.
ఫేస్​బుక్​ తమతో చర్చలు జరిపిన విషయంపై వాషింగ్టన్​ పోస్ట్, ఏబీసీ యాజమాని వాల్ట్​ డిస్నీకో స్పందించలేదు.

ఫేస్​బుక్​... న్యూస్​ ట్యాబ్​

ప్రత్యేకంగా వార్తలు చూసుకునేందుకు వీలుగా 'న్యూస్​ ట్యాబ్​' సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫేస్​బుక్​ ధ్రువీకరించింది. ఏప్రిల్​ నుంచి ఈ విషయమై వార్తా విభాగంతో ఫేస్​బుక్ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
స్పష్టత లేదు

ఫేస్​బుక్​ వ్యక్తిగత ప్రచురణకర్తలకు 3 మిలియన్​ డాలర్లు ఇస్తుందా లేదా మొత్తం అన్ని వార్తా సంస్థలకు కలిపి ఇస్తుందా అనే విషయాన్ని వాల్​స్ట్రీట్​ స్పష్టం చేయలేదు.

ఉచితంగా వాడుకున్నాయ్​

ఫేస్​బుక్, గూగుల్​... తమ కంటెంట్​ను పూర్తి ఉచితంగా వాడుకుని, డిజిటల్ యాడ్​ల రూపంలో డాలర్లు గడిస్తున్నాయని, ఇది తమకు ఎంతో నష్టాన్ని కలిగిస్తోందని వార్తా పరిశ్రమ ఏళ్లుగా విమర్శలు చేస్తూనే ఉంది.

ఇదీ చదవండి: 'వార్తలు వారివి... కోట్ల డాలర్లు గూగుల్​వి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details