తెలంగాణ

telangana

ETV Bharat / business

తుక్కు విధానం.. ప్రభుత్వ వాహనాలతోనే షురూ! - తుక్కు విధానంపై కేంద్ర ప్రతిపాదన

కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నిలిపివేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఖరారైతే.. కేంద్రం సహా రాష్ట్రాల్లో 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకునే అవకాశం ఉండదు.

govt vehicles
తుక్కు విధానం.. ప్రభుత్వ వాహనాలతోనే షురూ!

By

Published : Mar 14, 2021, 5:18 AM IST

వాహన తుక్కు విధానం అమలును ప్రభుత్వ వాహనాలతోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నిలిపివేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు నిబంధనలు సవరించడంపై ప్రభుత్వ యంత్రాంగాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదనలు ఖరారైతే.. ఇటు కేంద్రంతో పాటు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ శాఖలు, స్వంతంత్ర సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక పాలనా యంత్రాంగంలో 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటం సహా పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని సీతారామన్‌ అన్నారు.

ఇదీ చదవండి :త్వరలో బ్యాంకులకు రూ.14,500 కోట్ల నిధులు

ABOUT THE AUTHOR

...view details