తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ కార్లపై అదిరే ఆఫర్లు- 75వేల వరకు డిస్కౌంట్లు - రెనో కార్లపై ఆఫర్లు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా డస్టర్, ట్రైబర్, క్విడ్​పై గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనాలను పొందొచ్చని వెల్లడించింది.

Renault india announced cash discounts on its models for the month of April 2021
రెనో కార్లపై ఏప్రిల్​లో అదిరిపోయే ఆఫర్లు

By

Published : Apr 8, 2021, 2:49 PM IST

ఫ్రెంచ్​ ఆటో దిగ్గజం రెనో భారతదేశ విపణిలో పలు మోడళ్లపై బంపర్​ ఆఫర్లను ప్రకటించింది. ప్రారంభ స్థాయి మోడల్ క్విడ్​ నుంచి.. రెనోలో విజయవంతమైన డస్టర్​ వరకు సరికొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ఇవి అందుబాటులో ఉంటాయని 'రెనో ఇండియా' ప్రకటించింది. వినియోగదారులకు గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది.

ఈ కంపెనీ ప్రస్తుతం ట్రైబర్, క్విడ్, డస్టర్​ మోడళ్లను అందిస్తోంది.

క్విడ్: రూ.50,000

క్విడ్​ కారు కొనే వినియోగదారులకు రూ.50 వేల వరకు గరిష్ఠ ప్రయోజనాలను కల్పించనుంది రెనో.

ఎక్సేంజ్​ ఆఫర్ నగదు ప్రయోజనాలు:

  • 2020 మోడల్​పై రూ.20,000
  • 2021 మోడల్​పై రూ.10,000 వరకు
  • లాయల్టీ ప్రయోజనాలు రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000
  • గ్రామీణ వినియోగదారులకు రూ.5,000 ప్రత్యేక తగ్గింపు

ట్రైబర్​: రూ.55,000

రెనో ట్రైబర్​పై రూ.55,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు వర్తిస్తాయని కంపెనీ మార్కెటింగ్​ విభాగం తెలిపింది.

2021 మోడల్​పై​..

  • రూ.20,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్​ ప్రయోజనం
  • ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
  • రూ.25,000 వరకు నగదు ప్రయోజనాలు
  • రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్,
  • గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేక వడ్డీరేటు(6.99శాతం)

2021 మోడల్​పై​..

  • రూ.20,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్​ ప్రయోజనం
  • ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
  • రూ.15,000 వరకు నగదు ప్రయోజనాలు
  • రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.5,000 ప్రత్యేక ఆఫర్​తో పాటు 6.99 వడ్డీ రేటు కల్పించనుంది.

డస్టర్​పై ఇలా..

  • రెనోలో డస్టర్ 1.5లీటర్ వేరియంట్​పై రూ.45,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు అందివ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • ఆర్​ఎక్స్​ఎస్​, ఆర్​ఎక్స్​జడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం
  • రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
  • రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.15,000 ప్రత్యేక ఆఫర్

డస్టర్​ 1.3లీటర్​..

  • రెనో డస్టర్ 1.3లీటర్ వేరియంట్​పై రూ.75,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు అందివ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో..
  • ఆర్​ఎక్స్​ఎస్​, ఆర్​ఎక్స్​జడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం..
  • రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు, ఆర్​ఎక్స్ఈ వేరియంట్‌కు రూ.20,000
  • ఆర్​ఎక్స్​ఎస్-సీవీటీ, ఎమ్​టీ వేరియంట్లపై మాత్రం రూ.30,000 వరకు నగదు ప్రయోజనాలు
  • రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.15,000 ప్రత్యేక ఆఫర్

పైన పేర్కొన్న ఆఫర్లన్నీ 2021 ఏప్రిల్ 30 వరకు, ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం సమీపంలో ఉన్న రెనో షోరూమ్​ను సంప్రదించాల్సిందిగా సూచించింది.

ఇవీ చదవండి:దివ్యాంగులకు జీఎస్‌టీ తగ్గింపు: రెనో

'కారు విలాసం కాదు.. అవసరం'

పండగ ఆఫర్లు.. చిన్న కార్లపై పెద్ద డిస్కౌంట్లు!

ABOUT THE AUTHOR

...view details