కొవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్ రెమ్‌డెసివర్ ఉత్పత్తి సుమారు 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం నెలకు 1.05 కోట్ల సూది మందు సీసాలు తయారవుతున్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి మన్సుఖ్ మాండావియా తెలిపారు.
'నెలకు 1.05 కోట్ల 'రెమ్‌డెసివిర్' ఔషధాలు ఉత్పత్తి' - రెమ్‌డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యం
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్న సూది మందు రెమ్‌డెసివిర్ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. గత నెలతో పోలిస్తే వీటి ఉత్పత్తి 3 రెట్లు పెరిగినట్లు తెలిపింది.
రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్
ఈ ఏడాది ఏప్రిల్ 12 నాటికి నెలకు 37 లక్షల ఇంజెక్షన్లు తయారయ్యేవని, మే 4 నాటికి ఉత్పత్తి నెలకు 1.05 కోట్లను మించిందని మాండావియా ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 ప్లాంట్లలో ఈ ఔషధం తయారవుతోందని, నెల రోజుల క్రితం 20 పాంట్లలోనే దీనిని ఉత్పత్తి చేసేవారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్-19కు సమాధానం 'కొవాగ్జిన్'