తెలంగాణ

telangana

ETV Bharat / business

Reliance News: రిలయన్స్‌కు హరిత ఇంధనం- ఐదేళ్లలో భారీగా లాభాలు!

హరిత ఇంధన వ్యాపారంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance News). వచ్చే 5 ఏళ్లలో మొత్తం పన్నుకు ముందు లాభం(ఎబిటా)లో 10 శాతాన్ని ఈ వ్యాపారం నుంచే రిలయన్స్​ సాధించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ నివేదిక వెల్లడించింది.

reliance news
reliance news

By

Published : Oct 25, 2021, 5:37 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) హరిత ఇంధన వ్యాపారంపై (Reliance News) భారీగా పెట్టుబడులు పెడుతోంది. వివిధ సంస్థలతో వరుస ఒప్పందాలతో సంస్థకు ఓ రూపు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో మొత్తం పన్నుకు ముందు లాభం(ఎబిటా)లో 10 శాతాన్ని ఈ వ్యాపారం నుంచే సాధించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ నివేదిక వెల్లడించింది. ఆర్‌ఈసీ, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, స్టీసాల్‌, నెక్స్‌వేఫ్‌, ఆంబ్రి తదితర సంస్థలతో 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడులు) విలువైన ఒప్పందాలను ఆర్‌ఐఎల్‌ ఇటీవల ప్రకటించింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే..

నైపుణ్యం, సాంకేతికతతో ముందుకు..

  • ఈ పెట్టుబడులతో రిలయన్స్‌కు సౌర, బ్యాటరీ, హైడ్రోజన్‌ వంటి హరిత ఇంధన రంగంలో నైపుణ్యం, సాంకేతికత లభించడంతో పూర్తి సమ్మిళిత పునరుత్పాదక ఇంధన వ్యవస్థను ఏర్పాటు చేయడం సులువవుతుంది. అంతర్జాతీయంగా కొనుగోలు చేసిన సాంకేతికతతో రిలయన్స్‌కు భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాణిజ్యం చేసే అవకాశం లభించింది.
  • స్వచ్ఛ ఇంధన రంగంలో సాంకేతికతపై రిలయన్స్‌ రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఫ్యూయల్‌ సెల్స్‌, స్వచ్ఛ ఇంధన రంగానికి కావల్సిన ముఖ్యమైన మెటిరీయల్స్‌పై ఈ నిధులు వెచ్చిస్తుంది.
  • ఫ్యూయల్‌ సెల్స్‌ అభివృద్ధికి సంబంధించిన సాంకేతికత ఇంకా రిలయన్స్‌ చేతికి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్లగ్‌ పవర్‌, బల్లార్డ్‌, సెరెస్‌ వంటి పరిశ్రమ దిగ్గజాల్లో ఒకదాని నుంచి లైసెన్స్‌ కొనుగోలు చేయాలని భావిస్తోంది.

36 బి. డాలర్లకు ఇంధన వ్యాపారం

  • 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులు ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఆర్‌ఐఎల్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. కిలో హరిత హైడ్రోజన్‌ను డాలర్‌కే అందించాలని అనుకుంటోంది. ఈ లక్ష్యాల్ని సాధించడానికి వచ్చే 3 ఏళ్లలో 10 బి.డాలర్లు (సుమారు రూ.75,000 కోట్లు) కొత్త ఇంధన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ఈ ప్రణాళికలు చూస్తే స్వచ్ఛ ఇంధన వ్యాపార విలువను 36 బి.డాలర్లకు చేర్చే ఉద్దేశంతో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. 2035 నాటికి కర్బన ఉద్గార రహిత ఇంధన లక్ష్యాన్ని సాధించాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది.
  • గత జూన్‌లో జరిగిన వాటాదార్ల సమావేశంలో తక్కువ కర్బన ఇంధన రంగంలో 10 బి.డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో సౌర పీవీ మాడ్యుళ్లు, ఎలక్ట్రోలైజర్స్‌, ఫ్యూయల్‌ సెల్స్‌, బ్యాటరీల సమ్మిళిత వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన గిగా ఫ్యాక్టరీల నిర్మాణానికి రూ.60,000 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. వాల్యూ చైన్‌, టెక్నాలజీ, భాగస్వామ్యాల కోసం మరో రూ.15,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.
  • రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) 771 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5,800 కోట్లు) వెచ్చించి చైనా నేషనల్‌ బ్లూస్టార్‌ (గ్రూప్‌) కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న ఆర్‌ఈసీ సోలార్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. నార్వే, సింగపూర్‌లలోని ప్లాంట్లలో సోలార్‌ గ్రేడ్‌ పాలీసిలికాన్‌లు, సోలార్‌ ప్యానెళ్లు, మాడ్యూళ్లను ఆర్‌ఈసీ తయారు చేస్తోంది.

ఇదీ చూడండి:reliance jio: జియో డేటా విప్లవానికి 5 ఏళ్లు- టెక్ కంపెనీల అభినందనలు

ABOUT THE AUTHOR

...view details