తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ ఉద్యోగులకు మే 1 నుంచి ఉచిత టీకా

రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగితో పాటు.. భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల టీకాలకయ్యే పూర్తి ఖర్చును కంపెనీ భరిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటన విడుదల చేసింది.

mukhesh neeta ambani
ముకేశ్​ అంబానీ, నీతా అంబానీ

By

Published : Apr 23, 2021, 11:53 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఉద్యోగులందరికీ కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన రిలయన్స్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులందరికీ టీకా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాక్సిన్​ కార్యక్రమాన్ని 'ఆర్-సురక్షా'గా పిలుస్తోంది రిలయన్స్​.

రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ దంపతులు రాసిన లేఖ

అర్హత కలిగిన సభ్యులందరికీ టీకా ఖర్చును కంపెనీ భరిస్తుందని రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఆర్‌ఐఎల్ ఉద్యోగులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

''భారత ప్రభుత్వం నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా.. 18 సంవత్సరాలు పైబడిన రిలయన్స్ ఉద్యోగులకు సొంత టీకా కార్యక్రమం ఆర్-సురక్షాను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది.''

-రిలయన్స్ ఉద్యోగులకు లేఖ

ఇదీ చదవండి:రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details