తెలంగాణ

telangana

ETV Bharat / business

జీ ఎంటర్​టైన్​మెంట్​తో రిలయన్స్​ విలీన ప్రతిపాదన రద్దు - ఇన్వెస్కో

జీ ఎంటర్​టైన్​మెంట్​తో విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నామని (Reliance Zee Merger) రిలయన్స్​ ప్రకటించింది. గోయెంకా, ఇన్వెస్కోల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఇబ్బందికర లావాదేవీలను కోరుకోవట్లేదని స్పష్టం చేసింది.

reliance deal with zee
జీ ఎంటర్​టైన్​మెంట్​తో రిలయన్స్​ విలీన ప్రతిపాదన రద్దు

By

Published : Oct 14, 2021, 5:21 AM IST

కొద్ది నెలల కిందట కంపెనీకి చెందిన మీడియా ఆస్తులను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం చేయాలని (Reliance Zee Merger) ప్రతిపాదించినా, జీ వ్యవస్థాపకుల పాత్ర విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఉప సంహరించుకున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పష్టం చేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తిరిగి పుంజుకునేలా రిలయన్స్‌ చేస్తుందంటూ (Reliance Zee Merger) ఆ గ్రూప్‌నకు చెందిన అతిపెద్ద వాటాదారు(అమెరికా పెట్టుబడుల కంపెనీ ఇన్వెస్కో) ప్రకటించిన కొద్ది గంటల్లోనే రిలయన్స్‌ పై విధంగా స్పందించింది.

"ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో మా ప్రతినిధులకు, జీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఎండీ పునీత్‌ గోయెంకా మధ్య ప్రత్యక్ష చర్చలను ఏర్పాటు చేయడంలో ఇన్వెస్కో సహకరించింది. మా మీడియా ఆస్తులను సరైన విలువ వద్ద జీతో విలీనం చేయాలని అప్పట్లో భావించాం. ఇరు వర్గాలకు మెరుగైన విలువ అందేలా ప్రతిపాదనలు చేశాం. గోయెంకాతో పాటు ప్రస్తుత యాజమాన్యాన్ని కొనసాగించాలని భావించాం. వారికి ఇసాప్స్‌ (ఎంప్లాయీ స్టాక్‌ అష్టన్స్‌) జారీ చేయాలని ప్రతిపాదించాం. ఇన్వెస్కో మాత్రం గోయెంకాను తొలగించాలని కోరింది. గోయెంకా, ఇన్వెస్కోల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతూనే వచ్చాయి. మేం అందరు వ్యవస్థాపకులను గౌరవిస్తాం. ఎటువంటి ఇబ్బందికర లావాదేవీలను కోరుకోం. అందుకే ఆ ప్రతిపాదన నుంచి విరమించుకుంటున్నాము"

-రిలయన్స్​

అంతకుముందు ఏం జరిగిందంటే..

రిలయన్స్‌తో చర్చించిన షరతులతోనే, సోనీఇండియాతోనూ చర్చలు జరిగినా... సోనీతో విలీనానికి వ్యతిరేకించామన్న జీ ఆరోపణలను ఇన్వెస్కో ఖండించింది. రీలయన్స్‌తో లావాదేవీ కుదిర్చేందుకు ప్రయత్నించామని, అంతకు మించి ఏమీ లేదని ఇన్వెస్కో వెల్లడించింది. రిలయన్స్‌ పేరును వెల్లడించకుండా.. ఒక 'అతిపెద్ద కంపెనీ'తో ఒప్పందం జరిగితే వాటాదార్లకు నష్టం కలుగుతుందని పేర్కొంది. ఈ విషయంలో ఇన్వెస్కోపై గోయెంకా మంగళవారం నాడు అనుమానం వ్యక్తం చేశారు.

గోయెంకా, ఇతర బోర్డు సభ్యులను తొలగించడానికి వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇన్వెస్కో కోరుతూ వస్తోంది.

ఇదీ చూడండి :corbevax news: బూస్టర్‌ డోసుగా 'కార్బెవ్యాక్స్‌' టీకా!

ABOUT THE AUTHOR

...view details