తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారం విడిగా! - Saudi Aramco

రిలయన్స్​ ఇండస్ట్రీస్...​ తన వ్యాపార రంగంలో కొన్ని కీలక మార్పులు చేసుకున్నాయి. ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారాన్ని విడిగా ఓ కంపెనీగా చేయాలని రిలయన్స్‌ భావిస్తోంది.

Reliance unveils details of O2C business spinoff plan
రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారం విడిగా!

By

Published : Sep 9, 2020, 6:51 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఓ2సీ(ఆయిల్‌ టు కెమికల్‌) వ్యాపార యూనిట్‌ తన రిఫైనరీ, పెట్రో ఆస్తులు, రిటైల్‌ ఇంధన వ్యాపారాన్ని మాత్రమే కలిగి ఉండనుంది. కేజీ-డి6, జౌళి వంటి వ్యాపారాలు దీని కిందకు రావని కంపెనీ తన విడదీత ప్రణాళికల గురించి తెలిపింది. ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారాన్ని విడిగా ఓ కంపెనీగా చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. తద్వారా సౌదీ ఆరామ్‌కో వంటి కంపెనీలకు వాటాలను విక్రయించాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉంది.

ఓ2సీలో ఇవి ఉంటాయి..

ఇందులో భాగంగా.. రిలయన్స్‌ ఓ2సీ లిమిటెడ్‌లో.. చమురు రిఫైనింగ్‌, పెట్రో రసాయనాల ప్లాంట్లు, తయారీ ప్లాంట్లు, బల్క్‌, హోల్‌ సేల్‌ ఇంధన మార్కెటింగ్‌తో పాటు బీపీతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థలో 51 శాతం వాటా ఉంటాయి. సింగపూర్‌, బ్రిటన్‌కు చెందిన చమురు ట్రేడింగ్‌ అనుబంధ కంపెనీలు, మార్కెటింగ్‌ అనుబంధ సంస్థ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉరుగ్వే పెట్రోక్విమికా ఎస్‌ఏ, రిలయన్స్‌ ఈథేన్‌ పైప్‌లైన్‌లు కూడా ఓ2సీ సంస్థలోనే ఉంటాయి.

ఇవి ఉండవు..

సీబీఐ బ్లాకుల నుంచి కోల్‌ బెడ్‌ మీథేన్‌ను రవాణా చేసే గ్యాస్‌ పైపు లైన్లు, విదేశీ చమురు గ్యాస్‌ ఆస్తులు కలిగి ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డీఎమ్‌సీసీ, దేశీయ తవ్వక, ఉత్పత్తి ఆస్తులు ఓ2సీలో ఉండవు. ఇంకా జౌళి వ్యాపారం, జామ్‌నగర్‌ విద్యుత్‌ఆస్తులు, సిక్కా పోర్ట్స్‌ అండ్‌ టర్మినల్స్‌ కూడా అందులో ఉండవు.

15 కోట్ల జియో ఫోన్‌ వినియోగదార్లకు పిల్లల పుస్తకాలు

రిలయన్స్‌ జియోతో లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్‌రీడర్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. 15 కోట్ల మంది జియోఫోన్‌ వినియోగదార్లకు పిల్లల పుస్తకాలు అందుబాటులో పెట్టనున్నారు.'జియో ఫోన్లలోని వరల్డ్‌రీడర్‌కు చెందిన బుక్‌స్మార్ట్‌ అప్లికేషన్‌ ద్వారా 15 కోట్లకు పైగా వినియోగదార్లకు ఉచితంగా పిల్లల పుస్తకాలను అందించాలని భావిస్తున్న'ట్లు వరల్డ్‌రీడర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'కీలక ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అధ్వానం'

ABOUT THE AUTHOR

...view details