దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత సాధించింది(forbes reliance). ఆదాయం, లాభాలు, మార్కెట్ విలువలో దూసుకుపోతున్న రిలయన్స్.. ఫోర్బ్స్ విడుదల చేసిన 2021 వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్‌లోని(world's best employers 2021).. భారత సంస్థల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 52వ స్థానాన్ని దక్కించుకుంది(reliance news today).
58దేశాల్లో ఎంఎన్సీలకు పనిచేస్తున్న 1.5లక్షల మంది పూర్తిస్థాయి, పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఫోర్బ్స్ హామీనివ్వడం వల్ల స్వేచ్ఛగా రేటింగ్స్ ఇచ్చే అవకాశం వారికి దక్కింది. లింగ సమానత్వం, సామాజిక బాధ్యతలు, ప్రతిభను అభివృద్ధి చేయడం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలపై సర్వే జరిగింది.