భారత్‌లో క్రీడా, ఫ్యాషన్, వినోద కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, అమలుతో పాటు వాణిజ్యీకరణ వ్యాపారంలో నిమగ్నమైన ఐఎంజీ-రిలయన్స్‌లో(ఐఎంజీ-ఆర్) ఐఎమ్‌జీ సింగపూర్ వాటా 50 శాతాన్ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య కచ్చితంగా అమలయ్యే ఒప్పందం కుదిరింది. రూ.52.08 కోట్లతో ఈ వాటా కొనుగోలు పూర్తి చేయనున్నట్లు ఆర్‌ఐఎల్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ ఒప్పందం పూర్తవగానే ఐఎంజీ-ఆర్ సంస్థ ఆర్‌ఐఎల్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారిపోతుంది.
ఐఎంజీ-ఆర్‌లో 50% వాటా కొనుగోలు: ఆర్‌ఐఎల్ - రిలయన్స్-ఐఎంజీ
దేశంలో వివిధ వ్యాపారాలలో నిమగ్నమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. సింగపూర్ కంపెనీ ఐఎంజీ-ఆర్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవనున్నట్టు సమాచారం.
2010లో అంతర్జాతీయ స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ కంపెనీ ఐఎంజీ-ఆర్‌ను ఐఎంజీ, ఆర్‌ఐఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఐఎంజీ విషయానికొస్తే క్రీడలు, ఫ్యాషన్, ఈవెంట్లు, మీడియాలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఇది. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐఎంజీ-ఆర్ భారత్‌లో ఇవే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 2019-20లో రూ.181.70 కోట్లు, 2018-19లో రూ.195.55 కోట్లు, 2017-18లో రూ.158.26 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.
ఇదీ చదవండి:'రైతు' ఆందోళనలతో రైల్వేశాఖకు భారీ నష్టం