ఇజ్రాయెల్‌కు చెందిన బ్రీత్ ఆఫ్ హెల్త్(బీఓహెచ్) కంపెనీ నుంచి కొవిడ్ శ్వాస పరీక్ష వ్యవస్థలను రిలయన్స్ గ్రూప్ 15 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.110 కోట్లు)తో కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది.
ర్యాపిడ్ కిట్ల కోసం ఇజ్రాయెల్ సంస్థతో రిలయన్స్ డీల్ - reliance rapid kits deal with israeli firm
కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం చేసుకుంది రిలయన్స్. దీని విలువ రూ. 110 కోట్లు. ఈ కిట్ ద్వారా సెకన్ల వ్యవధిలో కరోనా ఫలితాన్ని తెలుసుకోవచ్చు.
ఈ కిట్ ద్వారా సెకన్లలోనే కొవిడ్ ఉందీ, లేనిదీ తెలుసుకోవచ్చని బీఓహెచ్ సీఈఓ అరీ లౌర్ పేర్కొన్నారు. ఈ పరికరాలను దేశవ్యాప్తంగా వీటిని రిలయన్స్ పంపిణీ చేస్తుంది. నెలకు లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి వినియోగిస్తారు.
శ్వాస పరీక్షా వ్యవస్థ ద్వారా కరోనాను 95 శాతం మేర విజయవంతంగా గుర్తించవచ్చని బీఓహెచ్ చెబుతోంది. పీసీఆర్ పరీక్షతో పోలిస్తే, ఇజ్రాయెల్ ఆసుపత్రుల్లో బీఓహెచ్ కిట్లతో నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో ఫలితాలు 98 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు తెలుస్తోంది.