తెలంగాణ

telangana

ETV Bharat / business

రోబోలపై రిలయన్స్​ గురి.. రూ.983 కోట్ల పెట్టుబడులు

RIL Investment News: ఇతర సంస్థల్లోకి రిలయన్స్​ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఓ రోబోటిక్స్​ సంస్థలో 54 శాతం వాటాను కొనుగోలు చేసింది రిలయన్స్​. సుమారు రూ. 983 కోట్లకు పైగా వెచ్చించి ఈ షేర్​ను సొంతం చేసుకుంది.

RELIANCE
రిలయన్స్​

By

Published : Jan 18, 2022, 4:17 PM IST

RIL Investment News: రిలయన్స్​ తన వ్యాపార సామ్రాజాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ.. తాజాగా దేశీయ రోబోటిక్స్​ కంపెనీలో 54 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకోసం సుమారు 132 మిలియన్​ డాలర్లను (సుమారు రూ.983 కోట్లు) వెచ్చించింది. ఈ విషయాన్న రోబోటిక్స్​ సంస్థ అయిన యాడ్​వెర్బ్​ ప్రతినిధి వెల్లడించారు.

సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా రిలయన్స్​ పెట్టుబడులను యాడ్​వెర్బ్​లోకి ఆహ్వానించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సంగీత్​ కుమార్​ తెలిపారు. దీనితో పాటు ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో అతిపెద్ద రోబోటిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడి కారణంగా కంపెనీ కార్యకలాపాల్లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే కొనసాగుతాయని వివరించారు.

ఇప్పటికే తమ సంస్థ ఏడాదికి సుమారు 10 వేలకుపైగా రోబోలను తయారు చేస్తున్నట్లు సంగీత్​ కుమార్​ తెలిపారు.

"తాజాగా రిలయన్స్..​ యాడ్​వెర్బ్​లో పెట్టుబడి పెట్టింది. దీంతో సుమారు 54 శాతం వాటాను సొంతం చేసుకొని సంస్థలో అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. రిలయన్స్​తో ఇప్పటికే మాకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జియో మార్ట్​ సేవల కోసం ఆటోమేటెడ్ వేర్​హౌసెస్​ను తయారు చేసాము. ఈ కారణంగానే మా సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఆ సంస్థతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా 5జీ సాంకేతికతను ఉపయోగించుకుంటూ, బ్యాటరీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటాము. దీని ద్వారా కార్బన్ ఫైబర్​తో మరింత అధునాతనమైన రోబోలను తయారు చేయగలం."

- సంగీత్​ కుమార్​, సీఈఓ-యాడ్​వెర్బ్​

ఇప్పటి వరకు సంస్థకు 80 శాతం మేర ఆదాయం దేశీయంగా వస్తుందని చెప్పిన సంగీత్​... తాజా పెట్టుబడుల కారణంగా వ్యాపారాన్ని విదేశాల్లో కూడా మరింత విస్తరించి.. 50 శాతానికి పైగా పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

వినియోగదారులకు షాక్​​- ఆ కార్ల ధరలు పెంపు

ABOUT THE AUTHOR

...view details