వాయిస్ కాల్స్, డేటా ఛార్జీల పెంపు ధరలపై స్పష్టతనిచ్చింది రిలయన్స్ జియో. డిసెంబర్ 6 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన జియో... తాజాగా ఆల్ ఇన్ వన్ ప్లాన్ల కొత్త టారిఫ్లను వెల్లడించింది. పాత వాటితో పోలిస్తే.. కొత్త ప్లాన్ల ఛార్జీలు 39 శాతం వరకు పెరిగాయి. అయితే... తమకు పోటీగా ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పెంచిన ధరల కంటే జియో... 15-25 శాతం తక్కువకే సవరించిన ప్లాన్లను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో.. జియో వినియోగదారులు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
కొత్త ప్లాన్ల వివరాలు..
నెలకు రూ.199 ప్లాన్ నుంచి ఏడాదికి రూ. 2,199 వరకు తాజా ప్లాన్లు ఉండనున్నాయి.
ఇది వరకు ఉన్న రూ.399(84 రోజుల కాలపరిమితి, ప్రతి రోజూ 1.5జీబీ) ప్లాన్.. 39 శాతం పెంపుతో రూ. 555కు రానుంది.