తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ 'జియో గిగాఫైబర్'​ సేవలు నేటి నుంచే... - INTERNET

జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​లు ఒకే ప్యాకేజీగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కాంప్లిమెంటరీగా సెట్​టాప్​ బాక్స్​ను ఉచితంగా అందివ్వనున్నట్లు సమాచారం.

నేడే ప్రతిష్ఠాత్మక 'జియో ఫైబర్'​ సేవలు ప్రారంభం

By

Published : Sep 5, 2019, 5:32 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

'జియో ఫైబర్'​ సేవలు ప్రారంభం

నేడు రిలయన్స్​ అధినేత ముఖేష్​ అంబానీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక జియో ఫైబర్​ బ్రాడ్​బ్యాండ్​ సేవలు ప్రారంభంకానున్నాయి. గిగా ఫైబర్​ సేవలతో బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​లను ఒకే ప్యాకేజీలో అందించనున్నారు.

రిలయన్స్​ జియో బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​తో డైరెక్ట్​ టు హోమ్​, కేబుల్​ టీవీ వినియోగదారులను ఆకర్షించడం కోసం సెట్​టాప్​ బాక్స్​ను కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం.

జియో గిగా ఫైబర్​ ప్రత్యేకతలు

  • జియో గిగా ఫైబర్​ సేవల్లో... వివిధ ప్లాన్లు రూ.700 - రూ.10,000 మధ్య లభిస్తాయి.
  • 100 ఎంబీపీఎస్ నుంచి గరిష్ఠంగా​ 1 జీబీపీఎస్​ స్పీడ్​ వరకు ఇంటర్నెట్​ ప్లానులు ఉన్నాయి.
  • వార్షిక ప్లాన్​ తీసుకున్నవారికి హెచ్​డీ టీవీ సెట్​ ఉచితంగా అందిస్తారు.
  • ల్యాండ్​లైన్​ ఫోన్​, జియో 4కే సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా ఇస్తారు.
  • జియో ఫైబర్​తో అల్ట్రా హై డెఫినిషన్​ ఎంటర్​టైన్​మెంట్​, హోమ్​ సెక్యూరిటీ, స్మార్ట్​ హోమ్ సొల్యూషన్స్​ వంటి సేవలు పొందవచ్చు.
  • చలనచిత్రాలు, ఇతర వీడియో కంటెంట్​ మొబైల్​ యాప్స్​ ఉచితంగా లభిస్తాయి.
  • మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్​, ఎస్​టీబీ వీడియో కాలింగ్​ సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. అయితే ఇందు కోసం వినియోగదారులు తమ టీవీ సెట్​లకు కెమెరాను అనుసంధానించుకోవాలి.
  • ల్యాండ్​లైన్​ నుంచి దేశంలో ఎక్కడికైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

భారతీ ఎయిర్​టెల్​లో ఇప్పటికే లభిస్తున్న కొన్ని ఎంటర్​టైన్​మెంట్​ కంటెంట్లు​ జియో ఫైబర్​లోనూ లభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొబైల్స్​ కోసం... హాట్​స్టార్​తో టై-అప్​ అయ్యింది జియో. 'ఈరోస్​ నౌ'ను పాక్షికంగా సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: 'రెపోరేటు ఆధారంగా గృహ, వాహన వడ్డీ రేట్లు'

Last Updated : Sep 29, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details