దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ సేవలకు బుధవారం మధ్యహ్నం వరకు అంతరాయం ఎదురయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని 'డౌన్‌డిటెక్టర్' వెల్లడించింది. నెట్వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.
జియో నెట్‌వర్క్‌లో అంతరాయంపై వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. భారత్‌లో జియోడౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్వర్క్ సమస్యను రిపోర్ట్ చేసినట్లు పేర్కొంది. ట్విట్టర్ పోస్టులను బట్టి చూస్తే.. బుధవారం ఉదయం నుంచి కనెక్టివిటీ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. దాంతో రిలయన్స్ జియో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదుల తాకిడి పెరిగినట్లు తెలిపింది డౌన్ డిటెక్టర్. ఈ సమస్య తాత్కాలికమేనని, పరిష్కారం కోసం తమ బృందం పనిచేస్తున్నట్లు కస్టమర్ కేర్ నుంచి సమాధానం వచ్చినట్లు చెప్పింది.