తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​టెల్​కు పోటీగా.. జియో 'వైఫై కాలింగ్'​..!

టెలికాం రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో.. వైఫై కాలింగ్ సేవల్ని ప్రారంభించింది. జనవరి 16 వరకు దశల వారీగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. దాదాపు 150కి పైగా మొబైల్ మోడళ్లలో ఈ వైఫై కాలింగ్ సదుపాయం ఉండనుంది.

Reliance Jio launches voice and video calling over Wi-Fi
వైఫై కాలింగ్ ప్రారంభించిన రిలయన్స్ జియో

By

Published : Jan 9, 2020, 7:03 AM IST

ప్రముఖ టెలికాం కంపెనీ జియో.. వైఫై కాలింగ్‌ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పరీక్షల దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు ప్రకటించింది. జనవరి 16 వరకు దశలవారీగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది. వైఫై కాలింగ్‌ సేవల్ని ఉపయోగించి వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని జియో తెలిపింది. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే జియో ఈ ఫీచర్‌ను ప్రకటించడం గమనార్హం. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ కొన్ని మొబైల్‌ మోడళ్లకే పరిమితం కాగా.. జియో వైఫై కాలింగ్‌ సదుపాయం దాదాపు 150కి పైగా మోడళ్లలో పనిచేస్తుండడం గమనార్హం.

ఉచితంగానే

మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని సమయంలో ఫోన్‌ కాల్స్‌ చేసుకునేందుకు ఈ వైఫై కాలింగ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు దగ్గర్లోని ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని జియో చెబుతోంది. దీనికోసం అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇందుకోసం మీ ఫోన్‌లోని వైఫై సెట్టింగ్స్‌లో వైఫై కాలింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఫోన్‌ ఈ ఫీచర్‌కు సపోర్ట్‌ చేస్తుందో లేదో అన్న విషయం జియో వెబ్​సైట్​కి వెళ్లి తెలుసుకోవాలి.

గత నెలలో ఎయిర్‌టెల్‌ దిల్లీ-ఎన్‌సీఆర్‌ వినియోగదారులకు వైఫై కాలింగ్‌ సేవల్ని తీసుకొచ్చింది. త్వరలో మెట్రో పాలిటన్‌ నగరాలకు విస్తరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జియో ఏకంగా దేశవ్యాప్తంగా ఈ సేవల్ని తీసుకురావడం గమనార్హం.

ఇదీ చదవండి: 'కేంద్ర బడ్జెట్​ కోసం సలహాలు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details