తెలంగాణ

telangana

ETV Bharat / business

'జియో ఫైబర్'​తో నట్టింట్లోనే అద్భుతాలు! - వీడియో గేమింగ్​

హైటెక్​ యుగంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా... ప్రపంచాన్ని వారి కళ్ల ముందుంచేందుకు నేడు రిలయన్స్​ మరో అడుగు ముందుకేసింది. జియో గిగాఫైబర్​తో బ్రాడ్​ బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​ను ఒకే ప్యాకేజీగా ఇస్తోంది. మిక్స్​డ్​ రియాలిటీ, వీడియో కాలింగ్, వీడియో గేమింగ్​, తక్కువ ధరకే అపరిమిత అంతర్జాతీయ కాలింగ్​, జియో సావన్​, జియో టీవీ అందుబాటులోకి రానున్నాయి.

'జియో ఫైబర్'​తో నట్టింట్లోనే అద్భుతాలు!

By

Published : Sep 5, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 12:09 PM IST

జియో గిగా ఫైబర్ 4కె సెట్​టాప్​ బాక్స్​ రూపంలో అసాధారణ సేవలు అందించేందుకు సిద్ధమైంది రిలయన్స్​. ​ఇప్పటికే అతి తక్కువ ధరకు అంతర్జాలాన్ని, అపరిమిత కాలింగ్ సేవలను అందిస్తూ టెలికారం రంగంలో విప్లవం సృష్టించిన జియో.. ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించడానికి సర్వసన్నద్ధమైంది. నేటినుంచే ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

మిక్స్​డ్​ రియాలిటీ

వర్చువల్ రియాలిటీ, ఆగ్​మెంటెడ్​ రియాలిటీలను కలిపి మిక్స్​డ్ రియాలిటీ అనే పేరుతో జియో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు ఇంట్లోనే ఉండి షాపింగ్​ చేయవచ్చు. తమకు నచ్చిన దుస్తులను వర్చువల్ రియాలిటీ చూసుకుని అనంతరం ఆన్​లైన్​లో ఆర్డర్​ చేయవచ్చు. విద్య, వినోద రంగాల్లోనూ ఈ పద్ధతి వినియోగించుకోవచ్చు. అంతరిక్షం లాంటి సంక్లిష్ట అంశాలనూ మిక్స్​డ్ రియాలిటీతో సులువుగా అర్థం చేసుకోవచ్చు.

టీవీలో... వీడియో కాలింగ్​

టీవీలో వీడియో కాలింగ్​ చేసుకునేందుకు 'జియో కాల్​' పేరిట ఓ యాప్​ను అందిస్తున్నారు. టీవీకి యూఎస్​బీ కెమెరా అనుసంధానం చేసి... అవతలవారి మొబైల్​, ల్యాప్​ట్యాప్​లకు కాల్​చేసి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడవచ్చు.

రూ.500కే... అంతర్జాతీయ కాల్స్​

అపరిమిత అంతర్జాతీయ కాల్స్​కు వీలుగా ఇంటర్నేషనల్​ ల్యాండ్​లైన్​ రోమింగ్​ ప్యాక్​ను అతి తక్కువ ధరకే జియో అందిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నెలకు రూ.500 ధరతో అమెరికా, కెనడాలకు అపరిమిత కాల్స్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.​ రిలయన్స్​ ప్లాన్ ప్రస్తుత టారిఫ్​లతో పోల్చితే ఇది 5 లేదా 10వ వంతు ఉంటుందని అంచనా.

వీడియో గేమింగ్​..

జియో సెట్​టాప్​ బాక్స్​లో వాయిస్​సెర్చ్​తో పాటు గేమింగ్​ సౌకర్యాలు కల్పించారు. సెట్​టాప్​ బాక్స్​ను టీవీకి అనుసంధానం చేసి, దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నవారితోనైనా సరే వర్చువల్​ ఆన్​లైన్​ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం అనేక సంస్థలతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది.

జియో సావన్​, జియో టీవీ

జియో ఫైబర్​ సేవలు ఆస్వాదించేందుకు 4కె సెట్​టాప్​ బాక్స్​ అత్యంత కీలకం. దీని ద్వారా వినియోగదారులు ప్రస్తుతం వీక్షిస్తున్న డీటీహెచ్​ ఛానళ్లతో పాటు ఓవర్​ ద టాప్​ ద్వారా జియో సావన్, జియో టీవీల లాంటి పలు రకాల సేవలు పొందవచ్చు.

ఇదీ చూడండి:భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు

Last Updated : Sep 29, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details