కరోనాను కట్టడి చేసేందుకు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు సంస్థలు అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ సరికొత్త ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది. 2జీబీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను పొందొచ్చు.
వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్‌లో సందేశాలు పంపుకొనే, కాల్స్ చేసుకొనే సదుపాయాలు లేవు. కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. ఇంతకుముందే బీఎస్‌ఎన్‌ఎల్ ఓ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొత్త కనెక్షన్ తీసుకొనే వారికి ఒక నెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందజేస్తామని వెల్లడించింది.