jio tariff hike: ప్రీపెయిడ్ ఛార్జీలపై రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. టారిఫ్‌లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది రిలయన్స్ జియో. ఈ ధరలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి.
- ప్రస్తుతం రూ.75 ఉన్న జియోఫోన్ ప్లాన్ రూ.91కి పెరగనుంది. 3జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 50 ఎస్ఎమ్ఎస్లు రానున్నాయి.
- అన్లిమిటెడ్ ప్లాన్ రూ.129.. రూ.155కు చేరనుంది. ఈ ప్లాన్‌లో 2 జీబీ నెలవారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎమ్ఎస్లు ఉంటాయి.
- రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ కాస్త.. రూ.666కి చేరుకుంటుంది. రూ.599 ప్లాన్ 719కి పెరగనుంది.
- రూ.2,399కి వచ్చే ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్.. పెరిగిన ధరల ప్రకారం రూ.2,897కి చేరుకుంటుంది.
పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇలా..
పెరిగిన ఎయిర్టెల్ ధరలు..
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్(airtel recharge).. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర 25శాతం.. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.
నూతన ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్టెల్ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50శాతం అధిక టాక్‌టైం, 200జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి సరాసరి రెవెన్యూ(ఏఆర్పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్‌టెల్‌కు(airtel recharge) చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్అప్స్పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్టెల్ పేర్కొంది.
వోడాఫోన్ ఛార్జీలు పెంపు..