జియో ఫైబర్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో. ఫైబర్ కనెక్షన్ ఉన్నవారికి రూ. 999 అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్లలో ఉన్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
ప్రైమ్ సభ్యత్వం యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
- జియో ఫైబర్ గోల్డ్ లేదా ఆపైన ధరలలో ఉన్న ప్లాన్లను.. జియో ఫైబర్ యూజర్లు రీఛార్జ్ చేసుకోవాలి.
- మై జియో యాప్ లేదా జియో.కామ్ వైబ్సైట్లో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి.
- అమెజాన్ ప్రైమ్ ఏడాది మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి ఆపై ప్రైమ్ ఖాతాకు సైన్ ఇన్ అవ్వాలి.