చమురు రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌స్వాప్ పథకాన్ని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఏ స్టాక్ ఎక్స్ఛేంజిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లను లిస్ట్ చేయలేదు. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వాటాదారులు తమ షేర్లను ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లతో మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది.
నాలుగింటికి ఒకటి
రిటైల్ విభాగానికి చెందిన నాలుగు షేర్లకు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరును ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ వెబ్‌సైట్లో పొందుపర్చింది. ఈ మార్పిడి పథకం విలువ దాదాపు రూ.2.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.