ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సౌర బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ వ్యాపారాలపై రాబోయే మూడేళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త ఇంధన వ్యాపారం విలువ 88 బిలియన్ డాలర్లకు(రూ.2.6 లక్షల కోట్లు) చేరొచ్చని వాల్‌స్ట్రీట్ బ్రోకరేజీ బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.
ప్రస్తుతం రిలయన్స్‌కు మూడు విభాగాల్లో వ్యాపారాలున్నాయి. చమురు-రసాయనాల(ఓ2సీ) విభాగంలో చమురు రిఫైనరీలు, పెట్రో రసాయనాల ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్ వ్యాపారాలున్నాయి. డిజిటల్ సేవల్లో టెలికాం సంస్థ జియో ఉంది. రిటైల్‌లో ఇ-కామర్స్ కూడా కలిసి ఉంది. కొత్త ఇంధన వ్యాపారం ఇప్పుడు నాలుగో విభాగం(వెర్టికల్) కిందకు రానుంది.
సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ను ఆర్‌ఐఎల్ బోర్డులోకి తీసుకొస్తున్నామని ముకేశ్ అంబానీ ప్రకటించడం, ఓ2సీ వ్యాపారానికి ఎంతో సానుకూల అంశంగా భావిస్తున్నారు. స్వచ్ఛ ఇంధనంపై పెట్టుబడి ప్రణాళికల్ని గమనిస్తే ఈ వ్యాపార విలువ 88 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోందని బెర్న్‌స్టీన్ తెలిపింది. ఓ2సీ వ్యాపార విలువ 60 బిలియన్ డాలర్లు, డిజిటల్ సేవల వ్యాపార విలువ 66 బి.డాలర్లు, రిటైల్ వ్యాపార విలువ 81.2 బి.డాలర్లు ఉంటుందని లెక్కగట్టింది. అప్‌స్టేమ్ ఆయిల్, గ్యాస్ కార్యకలాపాల విలువ 41 బి.డాలర్లు, మీడియా, ఆతిథ్య రంగాల్లోని పెట్టుబడుల విలువ 8. బి.డాలర్లతో కలిపి మొత్తం కంపెనీ విలువ 261 బి.డాలర్లకు పైగా (సుమారు రూ.19.57 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.
మార్జిన్లు పెంచుకోకుంటే.. రిస్కే!