తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో అత్యంత విలువైన సంస్థగా 'రిలయన్స్​' - మార్కెట్ క్యాపిటలైజేషన్​

రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​​ మరోసారి దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ ప్రకారం... సోమవారం మార్కెట్​ ముగింపు సమయానికి ఆర్ఐల్​ మార్కెట్ క్యాపిటలైజేషన్​ విలువ రూ.7,98,385.98 కోట్లుగా ఉంది. ఇది టీసీఎస్ కంటే రూ.12,505.29 కోట్లు అధికం.

దేశంలో అత్యంత విలువైన సంస్థగా 'రిలయన్స్​'

By

Published : May 15, 2019, 5:35 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ సోమవారం దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండు ట్రేడింగ్ సెషన్ల అనంతరం లాభాలను ఆర్జించిన ఆర్​ఐఎల్​... మార్కెట్​ విలువ ప్రకారం సాఫ్ట్​వేర్​ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్'​​ను అధిగమించింది.

బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ (బీఎస్​ఈ) ప్రకారం... మార్కెట్​ ముగింపు సమయానికి ఆర్ఐల్​ మార్కెట్ క్యాపిటలైజేషన్​ విలువ రూ.7,98,385.98 కోట్లుగా ఉంది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ క్యాపిటలైజేషన్ రూ.7,85,880.69 కోట్లు. అంటే టీసీఎస్​ కంటే ఆర్​ఐఎల్​ విలువ రూ.12,505.29 కోట్లు అధికం.

నష్టాల నుంచి లాభాల్లోకి

మార్కెట్ క్యాపిటలైజేషన్లో ప్రథమ స్థానంలో నిలవడానికి రిలయన్స్​, టీసీఎస్​ ఎప్పటి నుంచో పోటీపడుతూనే ఉన్నాయి. ఆర్​ఐఎల్ షేర్లు​ కొద్ది రోజుల క్రితం వరకు నష్టాలు చవిచూశాయి. ఫలితంగా... గత గురువారం టీసీఎస్​ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిస్థితిని తారుమారు చేసింది రిలయన్స్.

దేశీయ మార్కెట్లో ( ఎమ్​-క్యాప్) ప్రస్తుతం ఆర్​ఐఎల్​ అగ్రస్థానంలో ఉండగా, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ (రూ.6,24,089.61 కోట్లు), హెచ్​యూఎల్​ (రూ.3,66,787.51 కోట్లు), ఐటీసీ (రూ.3,60,4.3.77 కోట్లు)తో తరువాత స్థానాల్లో ఉన్నాయి.

స్టాక్​మార్కెట్​ను (లాభ, నష్టాలు) అనుసరించి కంపెనీల ఎమ్​-క్యాప్​ విలువలు ప్రతిరోజు మారుతుంటాయి.

ఇదీ చూడండి: మదుపరుల అప్రమత్తత- మళ్లీ నష్టాలు

ABOUT THE AUTHOR

...view details