తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఆఫర్లతో రిలయన్స్​ 'డిజిటల్ ఇండియా సేల్' - రిలయన్స్

ఈ నెల 11వ తేదీ వరకు ఆకర్షణీయమైన ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్​ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఎలక్ట్రానిక్స్​పై రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫోన్లు, ల్యాప్​టాప్​లు తక్కువ ధరల్లో లభ్యమవుతాయని పేర్కొంది.

reliance digital india sale till august 11
అదిరే ఆఫర్లతో రిలయన్స్​ 'డిజిటల్ ఇండియా సేల్'

By

Published : Aug 9, 2020, 6:03 AM IST

Updated : Aug 9, 2020, 6:10 AM IST

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ డిజిటల్ విక్రయ కేంద్రాల్లో, ఆన్​లైన్లో ఈ నెల 11 వ తేదీ వరకూ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది. 'డిజిటల్ ఇండియా సేల్' పేరుతో ఈ విక్రయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు తక్కువ ధరల్లో లభ్య మవుతున్నాయని రిలయన్స్ డిజిటల్ వివరించింది. వినియోగదారు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లేదా ఆన్‌లైన్లో నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చని తెలియజేసింది.

Last Updated : Aug 9, 2020, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details