పండుగ సమయంలో రిలయన్స్ డిజిటల్ సంస్థ వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు, అదనపు ప్రయోజనాలనూ అందిస్తున్నట్లు తెలిపింది. 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో ఈ ఆఫర్లు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా జరిపే కొనుగోళ్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ (నగదు వాపసు) సదుపాయాన్ని కల్పిస్తోంది.
రిలయన్స్ డిజిటల్ పండగ ఆఫర్లు - samsung galaxy s90 offfers
పండగ సీజన్లో రిలయన్స్ డిజిటల్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ''ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'' పేరుతో వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ ఆఫర్ల సందడి కొనసాగుతుందని వివరించింది.
రిలయన్స్ డిజిటల్ విక్రయ కేంద్రాల్లో సిటీ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇక తమ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో సిటీ బ్యాంక్ డెబిట్/ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే 15% క్యాష్ బ్యాక్ పొందవచ్చని రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. నూతనంగా మార్కెట్లోకి వచ్చిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 పైనా ఆఫర్లు అందిస్తోంది. ఇక పండగ బహుమతి కింద కొనుగోలుదార్లకు రూ.1000 వరకు విలువైన జియో, రిలయన్స్ ట్రెండ్ ఓచర్లు కూడా లభిస్తాయని తెలిపింది.