దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో.. వ్యాపార దిగ్గజం రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్.. ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం 2 గంటల్లోనే ఫలితాలను పొందవచ్చని సంస్థ తెలిపింది.
సార్స్ కోవ్-2ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశ్వసనీయ పరీక్ష విధానం ఆర్‌టీ- పీసీఆర్(రియల్ టైమ్ రిజర్వ్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలీమెర్సీ చైన్ రియాక్షన్). ఈ పరీక్షల్లో ఫలితం రావడానికి 24గంటల సమయం పడుతుంది. అయితే, ప్రస్తుతం రాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్‌ఏటీ)ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. 15-30 నిమిషాల్లో దీని ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఈ విధానంలో కొన్ని లోపాలు ఉన్నా, దీన్నే విస్తృతంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ఆర్-గ్రీన్ కిట్‌గా నామకరణం చేశారు.