తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 1:14 PM IST

ETV Bharat / business

రెడ్​మీ 8కి పోటీగా రియల్​మీ 5ఐ- గురువారం లాంఛ్​

జనవరి 9న భారత మార్కెట్​లో రియల్​మీ 5ఐ లాంఛ్​ కానుంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్​మీ 2020లో భారత్​లో విడుదల చేస్తున్న మొదటి స్మార్ట్​ఫోన్ ఇదే కావడం విశేషం.

Realme 5i India Launch Set for January 9
రెడ్​మీ 8కి పోటీగా రియల్​మీ 5ఐ- గురువారం లాంఛ్​

రియల్​మీ 5 సిరీస్​​లోని మరో సరికొత్త ఫోన్​ రియల్​మీ 5ఐ జనవరి 9న భారత్​ మార్కెట్​లో విడుదల కానుంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్​మీ 2020లో భారత్​లో విడుదల చేస్తున్న మొదటి స్మార్ట్​ఫోన్ ఇదే.

జనవరి 6న వియత్నాంలో రియల్​మీ 5ఐ లాంఛ్ అయింది. అంతకు ముందే రియల్​మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్​ తన ట్విట్టర్ ఖాతాలో రియల్​మీ 5ఐ టీజర్​ను ఉంచారు. జనవరి 9న ఈ స్మార్ట్​ఫోన్​ను భారత్​లో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రియల్​మీ తన అధికారిక వెబ్​సైట్​లో రియల్​ 5ఐ కోసం ప్రత్యేకంగా ఓ ల్యాండింగ్​ పేజీని కూడా ఏర్పాటుచేసింది.

రియల్​మీ 5ఐ ఫీచర్లు

  • 6.5 అంగుళాల హెచ్​డీ+(720X1600 పిక్సెల్​) ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే
  • వాటర్​ డ్రాప్​ నాచ్​ లేదా మినీ డ్రాప్​ నాచ్​
  • స్నాప్​డ్రాగన్​ 665 చిప్​సెట్​
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 4జీబీ+64జీబీ స్టోరేజి

రియల్​మీ యూఐ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. అది అందుబాటులోకి వచ్చేంత వరకు రియల్​మీ 5ఐ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా పనిచేసే కలర్ ఓఎస్​ 6.2తో నడుస్తుంది. ఎంట్రీ లెవల్ వినియోగదారులకు ఇది బాగా అక్కరకు వస్తుంది.

కెమెరా

రియల్​మీ టీజర్ ప్రకారం, క్వాడ్​ కెమెరా సెటప్​ ఉండొచ్చు. అయితే అధికారికంగా నిర్ధరణ కాలేదు.

12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్​ సెన్సార్​, మాక్రో కెమెరా ఉండొచ్చు.

రెడ్​మీ 8కి పోటీగా..

రియల్మీ 5ఐని రెడ్​మీ 8కి పోటీగా తీసుకొస్తున్నట్లు భావించవచ్చు. భారత్​లో ఈ స్మార్ట్​ఫోన్ ధర సుమారుగా రూ.7,999 నుంచి రూ.8,999 మధ్య ఉండొచ్చు.

ఇదీ చూడండి: కేంద్రానికి చుక్కెదురు.. 'ఆర్​కామ్​'కు రూ.104 కోట్లు రీఫండ్​!

ABOUT THE AUTHOR

...view details