దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా షియోమీ, రియల్మీల మధ్య ఈ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రెండు సంస్థలు పోటీపడి కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ఈ ఏడాది మార్చిలో షియోమీ 'రెడ్‌మీ నోట్ 7ప్రో' విడుదల చేయగా.. ఆ మోడల్‌కు పోటీగా ఏప్రిల్‌లో రియల్‌మీ 3 ప్రో'ను విడుదల చేసింది. అప్పట్లో వీటి ధరలు ఒకే విధంగా ఉండేవి. నోట్ 7 ప్రోతో పోలిస్తే.. రియల్ మీ 3 ప్రో ఫీచర్ల విషయంలో ముందు వరుసలో ఉండేది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు రూ. 10 వేలకు పైగా ఉండేవి.
రియల్ మీ 3ప్రో ఫీచర్లతో రెడ్ మీ బడ్జెట్ ఫోన్..
రియల్‌మీ 3ప్రో ఫీచర్లతో షియోమీ నోట్ 8ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటీవలే వీటి అమ్మకాలు ప్రారంభించింది. అయితే ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.9,999గా నిర్ణయించింది షియోమీ. ఈ నేపథ్యంలో.. 3 ప్రో మోడల్ ధరను.. నోట్ 8కు సమానంగా తగ్గించింది రియల్. ఇప్పుడు ధర ఫీచర్ల విషయంలో రెండు స్మార్ట్‌ఫోన్లు దాదాపు సమానంగా ఉండటం కారణంగా ఈ రెండు మోడళ్ల మధ్య గట్టిపోటీ ఉండే అవకాశముంది. రెండు ఫోన్ల ఫీచర్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
రెండు బడ్జెట్ ఫోన్ల ఫీచర్లు..
ఫీచర్లు | రియల్ మి 3ప్రో | రెడ్‌మి నోట్ 8 |
డిస్ప్లే | 6.3అంగుళాలు(హెచ్డీ+) | 6.3 అంగుళాలు(హెచ్డీ) |
రియర్‌కెమెరా | 16 ఎంపీ+5 ఎంపీ.. డ్యాయల్ కెమెరా | 48+8+2+2ఎంపీ క్వార్డ్ కెమెరా |
సెల్పీ కెమెరా | 25 ఎంపీ | 13 ఎంపీ |
ర్యామ్ | 4 జీబీ | 4 జీబీ |
మెమరీ | 64 జీబీ | 64 జీబీ |
ప్రాసెసర్ | స్నాప్‌డ్రాగన్ 710 | స్నాప్‌డ్రాగన్ 710 |
బ్యాాటరీ | 4045ఎంఏహెచ్ | 4000 ఎంఏహెచ్ |
రెడ్‌మీ నోట్ 8 డిజైన్, రియర్ మెరా, యుఎస్బి టైప్ C పోర్ట్, వంటి అంశాల్లో ముందుంది. రియల్ మి 3ప్రొ స్పెషల్ చిప్, డిజైన్, బ్యాటరీ, ప్రాసెసర్ అంశాల్లో ముందు ఉంది.
ఇదీ చూడండి : మీ పిల్లలు పాఠశాలకు సురక్షితంగా చేరుకుంటున్నారా?