కరోనా నేపథ్యంలో గత ఏడాది విధించిన లాక్డౌన్ వల్ల రియల్టీ, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. అయితే ఆంక్షలు సడలించడం వల్ల ఈ పరిస్థితి మారుతున్నట్లు తెలుస్తోంది.
భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగాలు కోలుకుంటున్నట్లు ఎన్ఎస్ఓ కూడా ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాల్లో పేర్కొంది. ఈ లెక్కలు రియల్టీ, నిర్మాణ రంగాల్లో ఉపాధిపై ఆసక్తితో పాటు.. నియామకాలు కూడా పెంచినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది.
ఇండీడ్ డేటా ప్రకారం..
రియల్టీ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి గత ఏడాది మార్చితో పోలిస్తే.. 2021 మార్చి నాటికి 22 శాతం పెరిగింది. నియామకాలు కూడా 3 శాతం పుంజుకున్నాయి.
నిర్మాణ రంగ ఉద్యోగాలపై కూడా 18 శాతం ఆసక్తి పెరగ్గా.. నియామకాలు స్వల్పంగా 0.3 శాతం పుంజుకున్నాయి.