RBL leadership changes: ఆర్బీఎల్ బ్యాంకు షేర్లు సోమవారం 20 శాతం కుప్పకులాయి. ఈ బ్యాంకు ఎండీ, సీఈఓ విశ్వవీర్ అహుజా మెడికల్ లీవ్‌పై వెళ్లడం, యోగేశ్ దయాల్‌ను ఆర్బీఎల్ అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ నియమించడం మదుపర్లలో భయాందోళనకు కారణమయ్యాయి. అంతేగాక ప్రస్తుత ఆర్బీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ అహుజాను బ్యాంకు తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఆర్బీఐ నియమించడం మదుపరుల్లో అనుమానాలను మరింత పెంచింది. యోగేశ్ దయాల్ ఇప్పటికే ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
ఆర్బీఐ అకస్మాతు నిర్ణయాలతో ఆరీబీఎల్ షేరు విలువ సోమవారం మధ్యాహ్నం 12:40గం. సమయంలో 15.39శాతం క్షీణించి రూ.145.95కి పడిపోయింది. ఒకానొక దశలో 20శాతం క్షీణించి రూ.132.35కి దిగజారింది. ఈ విలువ 52 వారాల కనిష్ఠా స్థాయిది కావడం గమనార్హం.
ఆర్బీఐ క్లారీటీ...
ఆర్బీఎల్ షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. మదుపర్లు, భాగస్వాములు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చింది.