తెలంగాణ

telangana

ETV Bharat / business

10 లక్షల ఫాలోవర్స్​తో 'ఆర్​బీఐ' ప్రపంచ రికార్డు - ఆర్​బీఐ తాజా వార్తలు

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆర్​బీఐ ట్విట్టర్​ ఖాతా అత్యధికంగా 10లక్షల మంది ఫాలోవర్స్​ను సంపాదించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి సెంట్రల్​ బ్యాంక్​గా ఆర్​బీఐ నిలిచింది.

RBI Twitter handle joins million followers club, first central bank in world to reach this milestone
ఆర్​బీఐ ప్రపంచ రికార్డు@10లక్షల ఫాలోవర్స్​

By

Published : Nov 22, 2020, 4:54 PM IST

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా ఫెడరల్ రిజర్వు, యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంకులను అధిగమించి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ) సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఆర్​బీఐ ట్విట్టర్​ ఖాతా అత్యధికంగా 10లక్షల మంది ఫాలోవర్స్​ను సంపాదించి ఈ ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న సెంట్రల్​ బ్యాంక్​ ట్విట్టర్​ హాండిల్​గా నిలిచింది ఆర్​బీఐ.

"ఆర్​బీఐ ట్విట్టర్​ ఖాతా 10లక్షల ఫాలోవర్స్​ను సంపాదించింది. ఇది సరికొత్త ఘనత. సంస్థ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు."

--శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్​.

ఆర్​బీఐ 2012లో ట్విట్టర్​ ఖాతాను ప్రారంభించింది. 2019, మార్చి వరకు 3లక్షల 42వేల మంది అనుసరించగా.. 2020 మార్చి నాటికి ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. లాక్​డౌన్​ కాలంలో మరో లక్షన్నర మంది ఫాలోవర్స్ పెరిగారని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2లక్షల 50వేల మంది ఆర్​బీఐ ఖాతాను ఫాలో అవుతున్నారన్నారు. దీంతోపాటు 'ఆర్​బీఐ సేస్​' అనే పేరుతో మరో ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తోంది రిజర్వు బ్యాంకు.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ బ్యాంక్​కు ప్రస్తుతం 6లక్షల 67వేల మంది ఫాలోవర్స్​ ఉన్నారు. యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంక్​ను 5లక్షల 91వేల మంది అనుసరిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details