తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకుల్లో మీ డబ్బు భద్రంగా ఉంది: ఆర్బీఐ - ఎస్​ బ్యాంక్​ న్యూస్​

బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న డిపాజిటర్లు ఎవ్వరూ ఆందోళన పడొద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందరి డబ్బు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ఎస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

rbi
బ్యాంక్​ డిపాజిటర్లకు ఆర్బీఐ హామీ

By

Published : Mar 8, 2020, 10:23 PM IST

ఎస్​ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందరి డబ్బు భద్రంగా ఉన్నట్లు ఉద్ఘాటించింది. అన్ని బ్యాంకులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

ఎస్​ బ్యాంక్ సంక్షోభంతో..

ఎస్​ బ్యాంక్​ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకుల్లో డిపాజిటర్లు దాచుకున్న సొమ్ముపై పలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది ఆర్బీఐ.

బ్యాంకులకు అప్పులు తీర్చే శక్తి అంతర్జాతీయంగా.. క్యాపిటల్​ టు రిస్క్​ వెయిటెడ్​ అసెట్స్​ (సీఆర్ఏఆర్​)పైన ఆధారపడి ఉంటుందని, మార్కెట్​ క్యాపిటల్​పై కాదని ట్వీట్​ చేసింది.

"ఆర్బీఐ అన్ని బ్యాంకులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఏ బ్యాంకులో ఖాతాలున్నా సరే తమ డిపాజిట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఆర్బీఐ హామీ ఇస్తోంది."

--- ఆర్బీఐ

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

ABOUT THE AUTHOR

...view details