తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 3:07 PM IST

Updated : Feb 29, 2020, 10:01 AM IST

ETV Bharat / business

వడ్డీరేట్లు యథాతథం.. భవిష్యత్​ ఆందోళనకరం!

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణ అనిశ్చితిలు కొనసాగుతాయని చెప్పడం ద్వారా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని చెప్పకనే చెప్పింది.

CPI inflation raises; overall outlook 'highly uncertain': RBI
ద్రవ్యోల్బణ అనిశ్చితితో భవిష్యత్ అగమ్యగోచరమే!

ఆర్​బీఐ 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆరో ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. రెపోరేటు 5.15 శాతం, రివర్స్​ రెపోరేటు 5.40 వద్ద యథాతథంగా ఉంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ అనిశ్చితిలు కొనసాగే అవకాశముందని... భవిష్యత్ కాస్త ఆందోళనకరమని ​చెప్పకనే చెప్పింది.

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో 6.5 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి తోడ్పాటు అందిస్తామని వెల్లడి
  • కూరగాయలు, పప్పుధాన్యాలు, పాల ధరల పెరుగుదల కారణంగా మొత్తం ఆహార ధరలు పెరిగే అవకాశం.
  • రిటైల్​ ద్రవ్యోల్బణం జనవరి-మార్చి త్రైమాసికంలో 6.5 శాతానికి చేరుకోవచ్చని అంచనా.
  • కరోనా వ్యాప్తి.. పర్యటకుల రాకను, ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడి
  • దేశీయ డిమాండ్​కు మద్దతుగా 2020-21 బడ్జెట్​లో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల రేషనలైజేషన్​
  • చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది.
  • మధ్యస్థ సంస్థలకు బ్యాంకులు అందించే రుణాలు (ప్రైసింగ్ ఆఫ్​ లోన్స్) ఏప్రిల్ 1నుంచి ఎక్స్​టర్నల్ బెంచ్​మార్క్​తో అనుసంధానం అవుతుంది.
  • జీఎస్టీ, రిజిస్టర్డ్ ఎంఎస్​ఎమ్​ఈ రుణాల పునర్నిర్మాణానికున్న గడువును ప్రస్తుతమున్న 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్​ వరకు పొడిగింపు.
  • హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సవరించిన నిబంధనలు జారీ అవుతాయి.
  • డిజిటల్ చెల్లింపుల పరిధిని తెలుసుకునేందుకు... జులై 2020 నుంచి డిజిటల్ చెల్లింపుల సూచిక (డీపీఐ)ని క్రమానుగతంగా ప్రచురించడం.
  • డిజిటల్ చెల్లింపుల కోసం స్వీయ-నియంత్రణ సంస్థ (ఎస్​ఆర్​ఓ) ఏర్పాటుకు ముసాయిదా రూపొందించడం.
  • పాన్​ ఇండియా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను సెప్టెంబర్​ నాటికి అమలు చేయడం.
  • ముడిచమురు ధరలు అస్థిరంగా ఉండొచ్చు.
  • 2020 ఫిబ్రవరి 4 నాటికి విదేశీ మారక నిల్వలు 471.4 బిలియన్ డాలర్లు.
  • నికర విదేశీ పెట్టుబడులు (ఎఫ్​డీఐ) 2019 ఏప్రిల్​-నవంబర్​లో 24.4 బిలియన్​ డాలర్లకు పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇది 21.2 బిలియన్​ డాలర్లుగా ఉంది
  • నికర విదేశీ పోర్ట్​ఫోలియో పెట్టుబడి (ఎఫ్​పీఐ) 2019-20లో (ఫిబ్రవరి 4 వరకు) 8.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు ఈ కీలక వడ్డీ రేటును యథాతథ స్థితిని కొనసాగించడానికి అనుకూలంగా ఓటు వేస్తారు
  • తదుపరి ఎంపీసీ సమావేశం 2020 మార్చి 31, ఏప్రిల్ 1, 3 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి:వడ్డీరేట్లే కాదు మా దగ్గర మరిన్ని అస్త్రాలున్నాయి: దాస్​

Last Updated : Feb 29, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details