RBI Penalty on Banks: పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ భారీ జరిమానా విధించింది. నియంత్రణపరమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకే ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది. 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టింది. పలు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు రికార్డులు ఉన్నట్లు గుర్తించింది.
- పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించకుండా.. జరిమానాలు విధింపుపై ఆర్‌బీఐ ఆదేశాలను పాటించని కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది ఆర్‌బీఐ.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు(RBI penalty PNB) రూ.కోటి 80 లక్షలు జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 సెక్షన్-19ని ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.