ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన భారీ రుణ ఖాతాలను 'మోసపూరిత' ఖాతాలుగా బ్యాంకులు గుర్తించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు డిసెంబరు 31ని గడువుగా పెట్టారని ఈ విషయాలతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపినట్లు వార్తా సంస్థ కోజెన్సిస్ వెల్లడించింది .
'హెచ్చరికలు జారీ చేసిన ఆయా ఖాతాల పరిస్థితిపై నివేదిక పంపడంతో పాటు, వాటిని సరిగ్గా వర్గీకరించడానికి ఆర్‌బీఐ ఈ గడువు నిర్ణయించింది . కొన్ని బ్యాంకుల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలంగా లేకపోవడం వల్లే ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది' అని బ్యాంకింగ్ అధికారి ఒకరు తెలిపారు . అటువంటి ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా గుర్తించడం, లేదంటే క్రమబద్ధీకరించిన పక్షంలో ఖాతాను నవీకరించడం వంటి విషయాల్లో బ్యాంకులు వేగం కనబరచడం లేదని .. అందుకే ఆర్బీఐ ఈ అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి . చాలా వరకు బ్యాంకులు కొన్ని ఖాతాలను 'మోసపూరితమైనవి'గా గుర్తించాయి . అయితే అన్ని బ్యాంకులూ ఈ విషయంలో ముందుకు రావాల్సి ఉందని ఆర్ బీఐ భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి .
- మోసపూరిత విభాగ ఖాతాలకు నాలుగు త్రైమాసికాల్లో 100 శాతం కేటాయింపులు జరపాల్సి ఉంటుంది.
- నిరర్థక ఆస్తుల విషయంలో ఎనిమిది త్రైమా సికాల్లో 100 శాతం కేటాయింపులు జరపాల్సి ఉంటుంది.
ప్రమాద హెచ్చరికల జారీ ఎందుకంటే